Amit Shah: ఏపీలో గూండాగిరిని అంతం చేస్తాం

Amit Shah: భూ మాఫియాను అంతం చేసేందుకు కూటమిగా ఏర్పడ్డాం

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 5 May 2024 3:47 PM IST
Amit Shah Speech in Dharmavaram
X

Amit Shah: ఏపీలో గూండాగిరిని అంతం చేస్తాం

Amit Shah: ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరిని అంతం చేసేందుకే టీడీపీ, జనసేనతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అవినీతిలో కూరుకుపోయిన వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో బీజేపీ అభ్యర్థి సత్య కుమార్‌కు మద్దతుగా నిర్వహించిన సభలో అమిత్‌ షా మాట్లాడారు.

ఆంధ్రాలో భూ మాఫియాను అంతం చేసేందుకు, అమరావతిని మళ్లీ రాజధానిగా ఏర్పాటు చేయడానికే కూటమిగా ఏర్పడ్డామని అమిత్ షా తెలిపారు. తిరుపతి వెంకటేశ్వరస్వామి పవిత్రను కాపాడతామన్నారు. బీజేపీ ఉన్నంత వరకూ తెలుగు భాషను అంతం కానివ్వమని అన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story