Atchannaidu: చంద్రబాబు అరెస్టును అమిత్‌షా కూడా తప్పుబట్టారు

Atchannaidu: ఏపీలో అక్రమ అరెస్టులపై కేంద్రహోంమంత్రికి ఫిర్యాదు చేశాం

Shekhar G
Published on: 12 Oct 2023 1:54 PM IST
Amit Shah Also Blamed Chandrababu Arrest  Says Atchannaidu
X

Atchannaidu: చంద్రబాబు అరెస్టును అమిత్‌షా కూడా తప్పుబట్టారు

Atchannaidu: చంద్రబాబు అరెస్టుతో కేంద్ర పెద్దల ప్రమేయం లేదని అమిత్ షా చెప్పారన్నారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచెన్నాయుడు. ఏపీలో ఓట్ల అవకతకలపై ఎస్‌ఈసీని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు అచ్చెన్న. ఏపీలో జరుగుతున్న అక్రమ అరెస్టులపై కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసినట్లు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లామన్నారు. రాష్ట్రంలో మాట్లాడే స్వేచ్ఛను హరిస్తున్నారని తెలియజేశామన్నారు. చంద్రబాబు అరెస్టును అమిత్ షా కూడా తప్పుబట్టారని అన్నారు అచ్చెన్న. చంద్రబాబు అరెస్టు విషయంపై అమిత్ షా సానుకూలంగా స్పందించారని తెలిపారు అచ్చెన్నాయుడు. తమ మద్దతు ఎప్పుడు న్యాయం, ధర్మం వైపే ఉంటుందని తెలియజేశారని అన్నారు అచ్చెన్నాయుడు.

Shekhar G

Shekhar G

Next Story