వైస్సార్ 2009లో చనిపోతే నిమ్మగడ్డకు 2021 లో గుర్తు వచ్చారా..?: అంబటి రాంబాబు

వైస్సార్ 2009లో చనిపోతే నిమ్మగడ్డకు 2021 లో గుర్తు వచ్చారా..?: అంబటి రాంబాబు
x

వైస్సార్ 2009లో చనిపోతే నిమ్మగడ్డకు 2021 లో గుర్తు వచ్చారా..?: అంబటి రాంబాబు

Highlights

చంద్రబాబు ఎజెండాలోనే ఎస్ఈసీ నిమ్మగడ్డ జిల్లాల పర్యటనలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. నిమ్మగడ్డలో పొలిటిషియన్ కలిసి సంకరజాతి...

చంద్రబాబు ఎజెండాలోనే ఎస్ఈసీ నిమ్మగడ్డ జిల్లాల పర్యటనలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. నిమ్మగడ్డలో పొలిటిషియన్ కలిసి సంకరజాతి కమిషనర్ లా అనిపిస్తున్నాడని అన్నారు. ఎన్నికల కోడ్ అనేది మంత్రులు, ఎమ్మెల్యేలకేనా నిమ్మగడ్డకు లేదా అని ప్రశ్నించారు. మతిబ్రమించి మాట్లాడుతున్న నిమ్మగడ్డను ఎర్రగడ్డకు పంపాలన్నారు.

నిమ్మగడ్డ జిల్లాల పర్యటనలు చంద్రబాబు అజెండాలో భాగమే..చంద్రబాబు రుణం తీర్చుకోవడం కోసం దిగజారి వ్యవహరిస్తున్నారు. నిమ్మగడ్డలో పొలిటీషియన్ కలిసి సంకర జాతి కమీషనర్ లా అనిపిస్తున్నాడు. నిమ్మగడ్డ రాజ్యాంగ శక్తివి కాదు.. చంద్రబాబు తొత్తువి..మార్చి 31 తరవాత టీడీపీ అధ్యక్షుడు అవుతావేమో..2009 లో వైస్సార్ చనిపోతే నిమ్మగడ్డ కు 2021 లో గుర్తు వచ్చారా..? సీఎం జగన్ ని కించపరిచే విధంగా నిమ్మగడ్డ వ్యాఖ్యలు చేస్తున్నారు. సీబీఐ కేసులో సాక్షిని అంటూ బెదిరిస్తున్నట్లు మాట్లాడుతున్నారు అని అంబటి అన్నారు.

మంత్రులు పర్యటనలు చెయ్యకూడదని మళ్ళీ కొత్త లెటర్ రాశారు..నిమ్మగడ్డ రాజకీయాలు మాట్లాడొచ్చా.. రాజకీయ నేతల గురించి మాట్లాడొచ్చా..ఎన్నికల కోడ్ అనేది మంత్రులు, ఎమ్మెల్యే లకేనా.. నిమ్మగడ్డకు లేదా..? అని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories