1983లో చంద్రబాబు టీడీపీలో ఉన్నారా?..అంబటి ఫైర్‌..

Ambati Rambabu Slams Chandrababu
x

1983లో చంద్రబాబు టీడీపీలో ఉన్నారా?..అంబటి ఫైర్‌..

Highlights

Ambati Rambabu: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Ambati Rambabu: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గోదావరి వరదలపై చంద్రబాబు బురద రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందించిన సాయం చూడలేక ఓర్వలేకపోతున్నారన్నారు. వరదల సమయంలో ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేసిందన్న అంబటి వరద సహాయం అందించేందుకు స్వయంగా ముఖ్యమంత్రే ప్రజల వద్దకు వెళ్లారని గుర్తుచేశారు.

కానీ చంద్రబాబు మాత్రం చూసి తట్టుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. పరామర్శల పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. ఇక 1983లో భద్రాచలంలో కరకట్ట కట్టానని చెబుతున్న చంద్రబాబు ఆ సమయంలో అసలు టీడీపీలో ఉన్నారా అని ప్రశ్నించారు. మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు కాబట్టే ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories