Ambati Rambabu: అంబటి రాంబాబుకు వీడని కష్టాలు.. పట్టాభిపురం కేసులో 14 రోజుల రిమాండ్!

Ambati Rambabu: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు న్యాయస్థానంలో మరోసారి చుక్కెదురైంది.

Arun Chilukuri
Published on: 9 Feb 2026 3:00 PM IST
Ambati Rambabu: అంబటి రాంబాబుకు వీడని కష్టాలు.. పట్టాభిపురం కేసులో 14 రోజుల రిమాండ్!
X

Ambati Rambabu: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు న్యాయస్థానంలో మరోసారి చుక్కెదురైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఇప్పటికే రిమాండ్‌లో ఉన్న ఆయనకు, పాత కేసు ఒకటి ఇప్పుడు మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టింది. పట్టాభిపురం పోలీసులు గతంలో నమోదు చేసిన కేసులో గుంటూరు కోర్టు అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది.

పీటీ వారెంట్‌పై గుంటూరుకు..

రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబును పోలీసులు పీటీ (Prisoner Transit) వారెంట్‌పై గుంటూరుకు తరలించారు. అనంతరం ఆయనను స్పెషల్ జ్యుడీషియల్ కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న న్యాయమూర్తి, అంబటికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

అసలేమిటా పట్టాభిపురం కేసు?

గతంలో వైకాపా ప్రభుత్వం హయాంలో వైద్య కళాశాలల పీపీపీ (PPP) విధానానికి వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళన కార్యక్రమం ఈ వివాదానికి మూలం. ఆందోళన సమయంలో అంబటి రాంబాబు పోలీసుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా, వారితో దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై పట్టాభిపురం పోలీసులు అప్పట్లోనే కేసు నమోదు చేయగా, ప్రస్తుతం ఆ కేసులో విచారణ వేగవంతం చేశారు.

బెయిల్ వస్తుందా? కస్టడీకి ఇస్తారా?

అంబటి రాంబాబును విచారించేందుకు పోలీసులు 'కస్టడీ పిటిషన్' దాఖలు చేయగా, ఆయన తరపు న్యాయవాదులు 'బెయిల్ పిటిషన్' వేశారు. వీటిపై కోర్టులో తదుపరి విచారణ జరగనుంది. ప్రస్తుతానికి న్యాయస్థానం రిమాండ్ విధించడంతో, పోలీసులు ఆయనను తిరిగి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story