Ambati Rambabu: ఏపీ ప్రజలకు అంబటి బహిరంగ లేఖ

Ambati Rambabu: పవన్‌ను నమ్మవద్దంటూ పిలుపు

Dhatripriya
Published on: 14 May 2023 8:50 AM IST
Ambati Rambabu Open Letter To AP People
X

Ambati Rambabu: ఏపీ ప్రజలకు అంబటి బహిరంగ లేఖ

Ambati Rambabu: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రాజకీయమంతా టీడీపీ అధినేత చంద్రబాబు కోసమేనని వైసీపీ నేత అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. బాబు చేత.. బాబు వల్ల.. బాబు కోసం పరితపించే పవన్‌ కల్యాణ్, బాబుతో తన రాజకీయ వివాహ బంధాన్ని పదిల పరుచుకునేందుకు తహతహలాడుతున్నాడంటూ రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. రైతుల పేరిట రెండు రోజుల పర్యటనలో ఇదే విషయాన్ని స్పష్టం చేశాడని. ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి అభిమానులు పవన్‌ కల్యాణ్‌కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలన్నింటితో పొత్తు అన్నది కేవలం పవన్‌ రాజకీయ ఎత్తు మాత్రమేనన్నారు. బీజేపీ చంద్రబాబును నమ్మటం లేదని, తాము సొంతంగా గెలవాలని బీజేపీ భావిస్తోందని ఆ పార్టీనేతలే చెప్పారన్నారు. ఈ నేపథ్యంలో నే రైట్‌–లెఫ్ట్‌–సెంటర్‌ పార్టీలన్నీ కలిసి రావాలన్న వాదనను పవన్‌ ముందుకు తెచ్చారన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story