Ambati Rambabu: రంగాను చంపింది టీడీపీ ప్రభుత్వమేనని కన్నా చెప్పారు

Ambati Rambabu Hot Commemts
x

Ambati Rambabu: రంగాను చంపింది టీడీపీ ప్రభుత్వమేనని కన్నా చెప్పారు 

Highlights

Ambati Rambabu: టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణపై మంత్రి అంబటి విమర్శలు

Ambati Rambabu: వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా ఏపీ మంత్రి అంబటి రాంబాబు నివాళులర్పించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులుర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణపై పరోక్ష విమర్శలు చేశారు.

వంగవీటి మోహనరంగాను హతమార్చింది టీడీపీ ప్రభుత్వమేనని.. ఆ పార్టీని గద్దె దించి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారన్నారు. టీడీపీ ప్రభుత్వమే రంగాను చంపినట్లు కన్నా అన్నారంటూ మంత్రి అంబటి ఆరోపించారు. చంద్రబాబు తనను కూడా చంపడానికి చూశాడని.. కానీ చంపలేకపోయినట్లు కన్నా లక్ష్మీనారాయణ చెప్పాడంటూ అంబటి ఆరోపించారు. పదవుల కోసం పాకులాడే వారిని సమాజం క్షమించదంటూ మంత్రి అంబటి హాట్ కామెంట్స్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories