Andhra Pradesh: టీడీపీ అంతరించిపోతున్న రాజకీయ పార్టీ-అంబటి

Andhra Pradesh: తెలుగుదేశం పార్టీ, చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

Arun Chilukuri
Published on: 30 March 2021 4:16 PM IST
Ambati Rambabu Fires On Chandrababu
X

Andhra Pradesh: టీడీపీ అంతరించిపోతున్న రాజకీయ పార్టీ-అంబటి

Andhra Pradesh: తెలుగుదేశం పార్టీ, చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. టీడీపీ అంతరించిపోతున్న రాజకీయా పార్టీ అని మళ్లీ అధికారంలోకి రావడం కల మాత్రమే అన్నారు. చంద్రబాబు నాయుడు టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని అంతర్ధాన దినోత్సవంలా చేశారని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ కుమారులకు పౌరుషం ఉంటే టీడీపీని కాపాడుకునే వారన్నారు. భవిష్యత్తులో టీడీపీ ఆఫీసులను హెరిటేజ్ మాల్స్ గా మార్చుకోవాల్సిందే అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి అభ్యర్థులు కూడా దొరకరని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ శిథిలావస్థకు చేరుకుందని విమర్శించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story