Ambati Rambabu: చంద్రబాబు సభలు అన్నీ అట్టర్ ఫ్లాప్

Ambati Rambabu: సొంత పార్టీ నేతలే చంద్రబాబును విమర్శిస్తున్నారు

Shashank Gullapelli
Published on: 7 April 2024 5:34 PM IST
Ambati Rambabu Comments On Chandrababu
X

Ambati Rambabu: చంద్రబాబు సభలు అన్నీ అట్టర్ ఫ్లాప్ 

Ambati Rambabu: చంద్రబాబు సభలు అన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయని, తన పార్టీ అభ్యర్థుల పేర్లే చంద్రబాబుకు గుర్తులేవని, సొంత పార్టీ నేతలే చంద్రబాబును విమర్శిస్తున్నారని ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. పొత్తు పెట్టుకోవడం... సమాధి కట్టేయడమే చంద్రబాబు పని అని దుయ్యబట్టారు. సందుల్లో సభలు పెట్టినా జనం రావడం లేదన్నారాయన.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను విమర్శించానే తప్ప తిట్టలేదన్నారు అంబటి... కన్నా లక్ష్మీనారాయణ తిట్టిన తిట్లు చంద్రబాబుకు గుర్తు లేవా అని ప్రశ్నించారు. జగన్‌ను విమర్శించే నైతిక అర్హత చంద్రబాబుకు లేదన్నారు. టీడీపీకి పోటీ చేసేందుకు అభ్యర్థులు లేరని, తాము వదిలేసిన వ్యక్తులకే టికెట్లు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story