Amaravthi: చంద్రబాబుపై విజయసాయి ఘాటైన వ్యాఖ్యలు

Amaravthi: ఒక్క కేసునైనా ఎదుర్కొని నిర్దోషిగా బయటపడు అంటూ విజయ్ సాయిరెడ్డి చంద్రబాబు పై ట్వీట్

Kranthi
Published on: 19 March 2021 4:52 PM IST
Amaravati: Vijayasai Reddy Satires On Chandrababu Naidu For Filing Squash Petition
X

Amaravati:(ఫోటో ది హన్స్ ఇండియా)

Amaravthi: తనదైన స్టైల్లో మరోసారి మాజీ సీఎం చంద్రబాబు పై ఎంపి విజయసాయి రెడ్డి ట్విట్టర్ ద్వారా విరుచుకుపడ్డారు. రాజధాని అసైన్డ్‌ భూముల వ్యవహారంలో సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను సవాల్‌ చేస్తూ తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణ హైకోర్టులో క్వాష్ పిటిషన్‌ దాఖలు చేశారు. సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు పిటిషన్‌లో కోరారు. దీని పై కోర్టులో వాదనలు జరుగుతున్నాయి.

అవినీతికి పాల్పడి నానా అడ్డదారులు తొక్కే బదులు ఒక్క కేసునైనా ఎదుర్కొని నిర్దోషిగా బయటపడు చంద్రం అంటూ హితవు పలికారు. చట్టం ముందు నిలబడే దమ్ముందా అసలు? అని టీడీపీ అధినేతను ప్రశ్నించారు. సిగ్గు లేకుండా వందోసారి స్టే కోసం ప్రయత్నిస్తున్నారని ఎంపి విజయ సాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

ప్రజా కోర్టులో ఇంకా ఘోరమైన శిక్షలు తప్పవు. ఎమ్మెల్యేగానూ నీకు ఓటమి తప్పదు. నీకు ఇల్లే జైలు అయిపోతుందంటూ చంద్రబాబుపై విజయసాయి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ''నీ మానిప్యులేషన్, మీడియా రాజకీయాలు నడవవు చంద్రబాబూ. వైసీపీ పాలనలో అక్రమాలు, అరాచకాలంటూ రోజూ ప్రెస్ మీట్లు, పచ్చ మీడియాలో డిబేట్లు. రెండేళ్లలో టీడీపీ ఓటింగ్ 10 శాతం తగ్గింది. 39 నుంచి 29కి పడింది. బాబు పార్టనర్ జనసేనకు 6 నుంచి 4కు చేరింది'' అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.


Kranthi

Kranthi

Next Story