ఏపీ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్‌పై సుప్రీంకోర్టు స్టే

X
Highlights
అమరావతి భూ కుంభకోణం కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది. మాజీ...
Arun Chilukuri25 Nov 2020 8:59 AM GMT
అమరావతి భూ కుంభకోణం కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది. మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటితో సహా 13 మందికి నోటీసులిచ్చింది. గ్యాగ్ ఆర్డర్‌ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై విచారణ జరిపింది సుప్రీంకోర్టు. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన రాజీవ్ ధావన్.. కేసు వివరాలు ఎందుకు వెల్లడి కావొద్దని ప్రశ్నించారు. దమ్మాలపాటి ఒక్కరు కోర్టును ఆశ్రయిస్తే, మిగిలిన 13 మందికి ఎలా వర్తింపజేస్తారన్నారు. ప్రభుత్వ వాదనలు విన్న త్రిసభ్య ధర్మాసనం తదుపరి విచారణ జనవరి చివరి వారానికి వాయిదా వేసింది. అప్పటివరకు ఈ కేసును ఫైనల్ చేయొద్దని హైకోర్టుకు ఆదేశాలు ఇచ్చింది.
Web TitleAmaravati Land Scam: Supreme Court issues stay on the High Court's gag order on media
Next Story