తణుకులో టెన్షన్ టెన్షన్.. పోటా పోటీ నిరసనకు వేదికైన తణుకు

Tanuku: మూడు రాజధానులు ముద్దు.. గో బ్యాక్ గో బ్యాక్ అంటూ ఫ్లెక్సీలు

Rama Rao
Published on: 12 Oct 2022 4:22 PM IST
Amaravati Farmers Padayatra Protest in Tanuku  | AP News
X

తణుకులో టెన్షన్ టెన్షన్.. పోటా పోటీ నిరసనకు వేదికైన తణుకు 

Tanuku: ఏలూరు జిల్లా తణుకులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అమరావతి రైతుల పాదయాత్ర కాసేపట్లో తణుకు నరేంద్ర సెంటర్‌కు చేరుకోనుంది. పాదయాత్రకు వ్యతిరేకంగా మహిళలతో వికేంద్రీకరణకు మద్దతుగా నిరసన తెలిపేందుకు జేఏసీ నేతలు రెడీ అయ్యారు. దీంతో తణుకు నరేంద్ర సెంటర్‌లో పోలీసులు భారీగా మోహరించారు. రైతుల పాదయాత్రకు ఎటువంటి ఆటంకం కలగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇటు తణుకు నియోజకవర్గం ఐతంపూడి నుండి వైసీపీ శ్రేణులు బైక్ ర్యాలీ చేపట్టేందుకు సిద్ధమయ్యారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ర్యాలీలో పాల్గొననున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని తణుకు ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Rama Rao

Rama Rao

Next Story