Amaravati: రేపు అమరావతి రైతుల మహా పాదయాత్ర
Amaravati: ఉదయం 9.5 గంటలకు యాత్ర ప్రారంభం
అమరావతి రైతుల పాదయాత్ర (ఫోటో ది హన్స్ ఇండియా)
Amaravati: అమరావతి రైతుల మహా పాదయాత్ర రేపు ఉదయం 9గంటల 5నిమిషాలకు ప్రారంభం కానుంది. యాత్రకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా తుళ్లూరు రైతు దీక్షా శిబిరంలో కాలభైరవ, లక్ష్మీ గణపతి, నవగ్రహ హోమాలు చేయనున్నారు. హోమానికి ముందు మహిళా రైతులు సర్వమత ప్రార్ధనలు నిర్వహించనున్నారు. తొలి రోజు యాత్రలో రైతులు ఏఢు కిలోమీటర్ల దూరంలోని పెదపరిమికి చేరుకొని అక్కడ భోజనం చేయనున్నారు. అనంతరం అక్కడి నుంచి మరో ఏడు కిలోమీటర్లు నడిచి తాడికొండలో రాత్రికి బస చేస్తారు.
Next Story




