సీఎం జగన్‌కు ఆళ్ల రామకృష్ణారెడ్డి లేఖ

సీఎం జగన్‌కు ఆళ్ల రామకృష్ణారెడ్డి లేఖ
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి లేఖ రాశారు. అందులో రాజధాని ప్రాంతంలో ఇచ్చిన బలవంతపు...

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి లేఖ రాశారు. అందులో రాజధాని ప్రాంతంలో ఇచ్చిన బలవంతపు భూసేకరణ చట్టాన్ని రద్దు చేయాలని పేర్కొన్నారు. గత ప్రభుత్వం రైతులకు ఇష్టం లేకపోయినా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం బలవంతంగా భూసేకరణ చేశారని.. ఇందుకు ఒప్పుకొని రైతులపై కేసులు కూడా పెట్టారని.. అంతేకాకుండా వారి పంటలను కూడా తగుటబెట్టించారని ఆరోపించారు ఆర్కే. ఏడాదికి మూడు నుంచి ఐదు పంటలు పండే ఈ భూములను తిరిగి ఇచ్చేలా చెయ్యాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. కాగా అమరావతి ప్రాంతంలో రాజధాని సరైన నిర్ణయం కాదని శివరామకృష్ణ కమిషన్‌ వెల్లడించిన విషయాన్ని కూడా చేర్చారు.

ఇదిలావుంటే అమరావతి ప్రాంతంలో రాజధానిని నిర్మించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం రైతుల వద్దనుంచి భూమిని సేకరించిన సంగతి తెలిసిందే. అయితే కొందరు రైతులు తమ భూమిని రాజధానికి ఇవ్వమని అప్పట్లో పెద్ద గొడవ చేశారు. కానీ ప్రభుత్వం బలవంతంగా వారి వద్దనుంచి తీసుకుంది. ఈ విషయంపై ఆళ్ల రామకృష్ణారెడ్డి అప్పటినుంచి పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం రాజధాని నిర్మాణంపై సందిగ్థత నెలకొంది.. గతంలోనే బలవంతంగా సేకరించిన భూమిని తిరిగి రైతులకు ఇస్తామని హామీ ఇచ్చారు జగన్. అయితే తాజాగా ఆర్కే రాసిన లేఖపై సీఎం ఎలా స్పందిస్తారో అని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories