విశాఖలో జీ-20 సదస్సుకు సర్వం సిద్ధం

* 40 దేశాల నుంచి హాజరుకానున్న 200 మంది ప్రతినిధులు

Dhatripriya
Published on: 28 March 2023 9:06 AM IST
All Set For G 20 Summit
X

విశాఖలో జీ-20 సదస్సుకు సర్వం సిద్ధం

G 20 Summit: ప్రతిష్టాత్మక జీ 20 సన్నాహక సదస్సుకు సర్వం సిద్ధమైంది. విశా‌ఖలోని ర్యాడిసన్ బ్లూ హోటల్ అందుకు వేదిక కానుంది. వన్‌ ఫ్యామిలీ, వన్‌ ఎర్త్, వన్‌ ఫ్యూచర్ అనే థీమ్‌తో ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. 40 దేశాల నుంచి 200 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

40 దేశాల నుండి డెలిగేట్స్ హాజరు అవుతున్న నేపథ్యంలో.. నగరం లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 130 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నగర సుందరీకరణ పనులు పూర్తి చేశారు. ఇక ఇవాళ సాయంత్రం జీ 20 సమావేశానికి ఏపీ సీఎం జగన్ హాజరుకానున్నారు. సదస్సులో హాజరయ్యే ప్రతినిధులతో మాట్లాడి గాలా డిన్నర్‌లో పాల్గొంటారు.

Dhatripriya

Dhatripriya

Next Story