ఏపీ క్యాబినెట్ సమావేశానికి సర్వం సిద్ధం

ఏపీ క్యాబినెట్ సమావేశానికి సర్వం సిద్ధం
x
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
Highlights

రేపు(డిసెంబర్ 27) న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం జరగనుంది.

రేపు(డిసెంబర్ 27) న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికోసం జీఎన్ రావు కమిటీ సిఫారసు చేసిన అంశాల నివేదికపై ప్రధానంగా చర్చ జరగనుంది. ప్రస్తుతం అమరావతిలో ఉన్న పూర్తిస్థాయి రాజధానిని మూడు ప్రాంతాలకు విస్తరించాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో క్యాబినెట్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం, మంత్రులు సమావేశం అవుతారు. మధ్యాహ్నం 3 గంటల వరకూ సమావేశం జరగనుంది.

అనంతరం భేటీ గురించి స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రులతో కలిసి మీడియాకు వెల్లడిస్తారని సమాచారం. అయితే మంత్రివర్గ సమావేశం సందర్బంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసు సిబ్బంది గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. సీఎం నివాసం, సచివాలయ పరిధిలో ఉన్న నివాసాలకు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. బంధువులు ఎవరైనా వస్తే సమాచారం అందించాలని వారిని ఆదేశించారు. మరోవైపు తాజా పరిణామాలపై ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ ఆరా తీస్తోంది. ఇవాళ సాయంత్రం డీజీపీ గౌతమ్ సవాంగ్ పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories