మూడో విడత పంచాయితీకి సర్వంసిద్ధం

X
Highlights
ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే రెండు దఫాల ఎన్నికలు విజయవంతంగా...
Arun Chilukuri16 Feb 2021 11:45 AM GMT
ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే రెండు దఫాల ఎన్నికలు విజయవంతంగా పూర్తికాగా రేపు ఉదయం మూడో విడత పోలింగ్ ప్రారంభం కానుంది. 13 జిల్లాల్లోని 20 రెవెన్యూ డివిజన్లు, 160 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం ఆరున్నర గంటల నుంచి మధ్యాహ్నం మూడున్నర గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మరోవైపు ఇప్పటికే 579 పంచాయతీలు, 11 వేల 732 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3 వేల 221 పంచాయతీలు, 19 వేల 607 వార్డులకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా రాత్రి వరకు ఫలితాలు వెల్లడిస్తారు అధికారులు.
Web TitleAll arrangements set for third phase panchayat elections
Next Story