Arrangements For August 15 celebrations : స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు సిద్ధం : డీజీపీ గౌతమ్ సవాంగ్

Arrangements For August 15 celebrations : రేపు (ఆగస్టు 15) జరగబోయే పంద్రాగస్టు వేడుకలకి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అన్ని విధాలుగా సిద్దం
Arrangements For August 15 celebrations : రేపు (ఆగస్టు 15) జరగబోయే పంద్రాగస్టు వేడుకలకి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అన్ని విధాలుగా సిద్దం అయినట్లుగా డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. స్వయంగా అయన శుక్రవారం మున్సిపల్ స్టేడియంలో వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. స్వాతంత్య్ర వేడుకలకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం సంసిద్ధం అయినట్టుగా వెల్లడించారు. కరోనా నేపధ్యంలో జరుగుతున్న వేడుకలు కావడంతో నిబంధనలు కచ్చితంగా పాటించి జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇక పెరేడ్‌కు సంబంధించిన ఫైనల్ రిహార్సల్స్‌ని పరిశీలించిన అయన వారికి పలు సూచనలు చేశారు. రేపు పెరేడ్‌లో ఆరు బెటాలియన్లకు చెందిన ఆరు కంటింజెంట్లు పాల్గొంటుండగా.. వివిధ శాఖలకు చెందిన పది శకటాలు ప్రదర్శన ఇవ్వనున్నాయి. ఆయన వెంట సీఎస్ నీలం సహానీ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, సీఎం పోగ్రాం కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం తదితరులు ఉన్నారు. ఇక రేపు ఉదయం సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ వేడుకల్లో పాల్గొని గౌరవ జెండావందనం చేయనున్నారు.
కరోనా విజృంభిస్తున్న నేపధ్యంలో జరుగుతున్న వేడుకలు కావడంతో గతంలో కన్నా భిన్నంగా ఈ సారి వేడుకలు నిర్వహించనున్నారు. అతిథులు కూర్చునే కుర్చీలను రెండు నుంచి మూడు గజాల దూరంలో ఉండేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ వేడుకల్లో పాల్గొనే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం కచ్చితంగా పాటించాలని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.
నిడదవోలు వైసీపీ ప్లీనరీ సమావేశంలో నోరుజారిన తానేటి వనిత
28 Jun 2022 7:36 AM GMTబొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
27 Jun 2022 4:00 PM GMTబాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMT
Warangal: సర్కారు స్కూళ్లల్లో సవాలక్ష సమస్యలు
29 Jun 2022 3:55 AM GMTఆదిలాబాద్ జిల్లాలో విద్యార్ధులకు పాఠ్య పుస్తకాల కష్టాలు
29 Jun 2022 3:12 AM GMTమన్యాన్ని వణికిస్తున్న సీజనల్ వ్యాధులు
29 Jun 2022 2:46 AM GMTవ్యవసాయ సీజన్ మొదలైనా నైరాశ్యంలో రైతన్న
29 Jun 2022 2:08 AM GMTONGC Helicopter Crash: ఓఎన్జీసీకి చెందిన హెలికాప్టర్‌కు ప్రమాదం
29 Jun 2022 1:29 AM GMT