Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్... ఆ రెండు రోజులు బ్రేక్ దర్శనాలు రద్దు

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 6 July 2024 10:54 AM IST
Alert To Srivari Devotees Break Darshan On 9th And 16th Are Cancelled
X

Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్... ఆ రెండు రోజులు బ్రేక్ దర్శనాలు రద్దు

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సాధారణ భక్తులకు 10 గంటల సమయం కాగా.. ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. ఇక నిన్న శ్రీవారిని 65వేల 775 మంది భక్తులు దర్శించుకున్నారు.

ఈనెల 9,16వ తేదీల్లో శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలు రద్దు చేయనుంది టీటీడీ. 9వ తేదీ శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం 16వ తేదీన ఆణివార ఆస్థానం కారణంగా బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. 9న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా.. అష్టదళపాదపద్మారాధన సేవ రద్దు, 16న ఆణివార ఆస్థానం సందర్భంగా.. సాయంత్రం పుష్పపల్లకిలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి ఊరేగింపును రద్దు చేసింది టీటీడీ.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story