Anantapur: అనంతపురం జిల్లా పరిషత్‌ ఎన్నికల ఓట్ల కౌంటింగ్‌లో వింత ఘటన

Anantapur: తన బాధను స్లిప్‌ ద్వారా విన్నవించుకున్న మద్యం ప్రియుడు

Sandeep Eggoju
Updated on: 20 Sept 2021 9:59 AM IST
Alcoholists Receipt in Ballot box in Anantapur District
X

మందుబాబు రాసిన రిసిప్ట్ (ఫైల్ ఇమేజ్)

Anantapur: అనంతపురం జిల్లాలో పరిషత్‌ ఎన్నికల ఓట్లను లెక్కిస్తున్న సిబ్బందికి బ్యాలెట్‌ బాక్స్‌లో ఓ స్లిప్‌ కనిపించింది. ఇక అది తెరిచి చూసిన సిబ్బంది ఒక్కసారిగా అవక్కాయ్యారు పైగా నవ్వు ఆపుకోలేక పోయారు. ఓ వ్యక్తి తన వింత కోరికను ఎవరికీ చెప్పాలో తెలియక ఎవరిని కలవాలో అర్థం కాక ఇలా బ్యాలెట్‌ బాక్స్ ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకున్నాడు.

ఇంతకీ ఆయన గారి సమస్య ఏంటి అనుకుంటున్నారా పాపం అతగాడికి వైన్స్ షాపుల్లో కూల్‌ బీర్లు దొరకడం లేదట. పైగా మంచి మంచి బ్రాండ్‌లు అందుబాటులో లేవట. వాటిని సమకూర్చండి అంటూ నల్లచెరువుకు చెందిన యువత పేరుతో తన వింత కోరికను విన్నవించుకున్నాడు. చీటీలో నల్లచెరువు యూత్ మందుబాబులు అంటూ రాసి సంతకం కూడా చేశాడు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story