Ahobilam: భక్తులకు గమనిక.. అహోబిలం ఆలయంలో రేపు దర్శనాలు నిలిపివేత.. కారణం ఇదే!

Ahobilam: ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రం అహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం (ఫిబ్రవరి 17) భక్తులకు స్వామివారి దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆలయ ప్రధాన కార్యనిర్వహణాధికారి (CAO) రామానుజన్ ఒక ప్రకటనలో తెలిపారు.
Ahobilam: ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రం అహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం (ఫిబ్రవరి 17) భక్తులకు స్వామివారి దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆలయ ప్రధాన కార్యనిర్వహణాధికారి (CAO) రామానుజన్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఫిబ్రవరి 17న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సమయం ముగిసిన అనంతరం యధావిధిగా భక్తులను దర్శనానికి అనుమతిస్తామని వెల్లడించారు.
అహోబిలంలో ఫిబ్రవరి 20వ తేదీ నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాలకు ముందు ఆలయ శుద్ధి కార్యక్రమమైన 'కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం' నిర్వహించడం ఆనవాయితీ. దీనిలో భాగంగా మంగళవారం ఆలయ గర్భాలయం, ఉప ఆలయాలను సుగంధ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో శుద్ధి చేయనున్నారు.
ఈ పవిత్ర కార్యక్రమం జరుగుతున్న సమయంలో గర్భాలయ ప్రవేశం మరియు దర్శనాలు ఉండవని, కావున సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఈ మార్పును గమనించి తమ యాత్రను ప్లాన్ చేసుకోవాలని సీఏవో కోరారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు ఇప్పటికే ముమ్మరంగా సాగుతున్నాయని ఆయన వివరించారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



