logo
ఆంధ్రప్రదేశ్

Coronavirus: ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ కరోనా విజృంభన

Again Spreading The Corona in Andhra Pradesh
X

కరోనా ( ఫైల్ ఇమేజ్ )

Highlights

Coronavirus: పలు జిల్లాల్లో పాజిటివ్‌ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది

Coronavirus: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. పలు జిల్లాల్లో పాజిటివ్‌ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు 31వేల 072 నమూనాలను పరీక్షించగా ఇందులో 1,730 మంది కరోనా బారిన పడినట్లు గుర్తించారు. నమూనాల్లో 5.56 శాతం పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో ముగ్గురు, నెల్లూరు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఐదుగురు మృతి చెందారు.

మార్చి 4న కేవలం 102 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా, నెల రోజుల వ్యవధిలో ఆ సంఖ్య ఏకంగా 1600కు పెరిగి 1730కి చేరడం గమనార్హం. ఇక ఇదేకాలంలో మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 871 నుంచి 10వేల 300కి పెరిగింది. కొవిడ్‌ మరణాల రేటు కూడా ఒక శాతం దాటేసింది. మార్చి 4 నాటికి రాష్ట్రంలో మొత్తం 7వేల 171 మరణాలు సంభవించగా, ఏప్రిల్‌ 4 నాటికి అవి 7వేల 239కి చేరాయి.

Web TitleCoronavirus: Again Spreading The Corona in Andhra Pradesh
Next Story