అప్పుడు జగన్ పాదయాత్రలో.. ఇప్పుడు షర్మిళ పాదయాత్రలో..

Honey Bees: వైఎస్సార్ టీపీ నాయకురాలు షర్మిళ బృందంపై తేనెటీగలు దాడి చేశాయి.

Arun Chilukuri
Published on: 23 March 2022 4:06 PM IST
After YS Jagan, Sharmila Attacked by Honey Bees
X

అప్పుడు జగన్ పాదయాత్రలో.. ఇప్పుడు షర్మిళ పాదయాత్రలో..

Honey Bees: వైఎస్సార్ టీపీ నాయకురాలు షర్మిళ బృందంపై తేనెటీగలు దాడి చేశాయి. పాదయాత్రలో భాగంగా నల్గొండ జిల్లా ఆత్మకూరు మండలానికి వెళ్తుండగా తేనెటీగలు దాడి చేశాయి. దారిలో తేనెతుట్టె ఉన్న చెట్టు కిందికి రాగానే తేనెటీగలు చెదిరిపోయి వైఎస్సార్ టీపీ బృందం మీద దాడి చేశాయి. అయితే గతంలోనూ జగన్ పాదయాత్రలో ఇలాగే తేనెటీగలు దాడి చేశాయి. ఆ సమయంలో జగన్ కంటి సమీపంలో తేనెటీగలు కుట్టి వాపు కూడా వచ్చింది. ఇప్పుడు చెల్లి షర్మిల వంతు అయింది. ఇలా అన్నచెల్లిల్లు పొలిటికల్ సవాళ్లతో పాటు తేనెటీగల దండయాత్రను తట్టుకొని పాదయాత్రలో కొనసాగుతున్నారు. జనంతో మమేకమయ్యేందుకు పాదయాత్రలో ఎదురయ్యే ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ధీటుగా నిలిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story