ఢిల్లీ నుంచి కోయంబత్తూరుకు ప్రత్యేక విమానంలో సాయితేజ పార్థివదేహం

*రేపు స్వగ్రామం ఎగువ రేగడపల్లికి సాయితేజ భౌతికకాయం *తమ్ముడు మహేష్ విజ్ఞప్తితో నేడు బెంగుళూరులోనే పార్థివదేహం

Sandeep Reddy
Updated on: 11 Dec 2021 12:57 PM IST
ఢిల్లీ నుంచి కోయంబత్తూరుకు ప్రత్యేక విమానంలో సాయితేజ పార్థివదేహం
X

Andhra Pradesh: లాన్స్‌ నాయక్ సాయితేజ భౌతిక కాయాన్ని గుర్తించారు. డీఎన్‌ఏ టెస్ట్ ద్వారా సాయితేజ భౌతిక కాయం గుర్తించిన అధికారులు ఢిల్లీ నుంచి కోయంబత్తూరుకు ప్రత్యేక విమానంలో సాయి తేజ భౌతిక కాయాన్ని అధికారులు తరలిస్తున్నారు. కోయంబత్తూరు మీదుగా బెంగళూరుకు.. అక్కడి నుంచి రోడ్డు మార్గం మీదుగా రేపు ఎగువ రేగడ పల్లి గ్రామానికి సాయి భౌతికకాయాన్ని తరలించనున్నారు. సైనిక లాంఛనాలతో రేపు అంత్యక్రియల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో స్వగ్రామానికి సాయి తేజ భౌతికకాయం చేరే అవకాశం ఉంది. అయితే బెంగళూరులోని సైనిక ఆస్పత్రిలోనే రాత్రికి ఉంచి రేపు ఉదయం తమకు అప్పగించాలని సాయి తేజ కుటుంబ సభ్యులతో సహా తమ్ముడు మహేష్ బాబు ఆర్మీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీంతో రేపు స్వగ్రామం ఎగువ రేగడ పల్లికి తరలించనున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story