ఏపీలో ఆలయాలపై దాడుల అంశం ఓ కొలిక్కి వచ్చినట్లేనా..?

ఏపీలో ఆలయాలపై దాడుల అంశం ఓ కొలిక్కి వచ్చినట్లేనా..?
x
Highlights

ఏపీలో చర్చనీయాంశంగా మారిన ఆలయాలపై దాడుల అంశం అధికారులకు ఎప్పటికప్పుడు డీజీపీ దిశానిర్ధేశం దాడులను తిప్పికొట్టాలని అధికారులకు మోటివేషన్ కుట్రలు భగ్నం చేసేందుకు పోలీస్‌బాస్ వ్యూహాలు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దాడులను తిప్పికొట్టాలి: డీజీపీ అప్రమత్తంగా ఉంటూ ఆలయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: డీజీపీ మతవిద్వేషాలు రెచ్చగొట్టేవారి కుట్రలు భగ్నం చేయండి: డీజీపీ

ఏపీలో ఆలయాలపై దాడుల అంశం ఓ కొలిక్కి వచ్చినట్లేనా..? కొన్ని కేసులు ఏపీ పోలీసులను ఇరుకున పెడుతున్నాయా..? రాజకీయ రంగు పులుముకున్న విగ్రహాల ధ్వంసం అంశం ఖాకీలకు ఎలాంటి సవాళ్లు విసురుతోంది..? హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం.

ఆలయాలపై దాడులకు సంబంధించి కేసుల చేధన, అరెస్టుల పర్వం ప్రతిరోజూ చర్చనీయాంశంగానే ఉంది. ఈ అంశంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా డీజీపీ దిశానిర్ధేశం చేస్తూనే ఉన్నారు. అయితే కేసుల పురోగతి మాత్రం ఇందుకు భిన్నంగా ఉందని చెప్పాలి. ఓ ఆలయంలో రథం తగులబెడితే.. మరోచోట మసీదులో చెత్త తగులబెట్టారని కేసొచ్చింది. దీంతో కొంతమంది ఉద్దేశ్యపూరితంగా చేస్తున్న దాడులను తిప్పికొట్టాలని మోటివేట్ చేస్తున్నారు డీజీపీ గౌతం సవాంగ్.

మరోవైపు.. మత విద్వేషాలు రెచ్చగొట్టేవారి కుట్రలు భగ్నం చేసేందుకు వ్యూహాలు చేస్తున్నారు పోలీస్‌బాస్. అటు.. విలేజ్ కమిటీల సేవలను వినియోగించుకోవాలని చూసినా.. ప్రాంతీయ పోలీసుల మధ్య విబేధాలతో ఆలయాల పరిరక్షణ కత్తిమీద సాముగానే మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల సహకారం తీసుకుని దాడులను అరికట్టాలని అధికారులను డీజీపీ ఆదేశించారు.

ఇక ఆలయాలపై దాడుల్లో రాజకీయ దురుద్దేశాలు బయటపడుతున్నాయని డీజీపీ చెబుతున్నారు. ఇలాంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. తప్పు చేసింది ఎంతటివారైనా విడిచిపెట్టొద్దని, ఆధారాలతో సహా బయటపెట్టాలన్నారు. అటు.. మత విద్వేషాలు రెచ్చగొట్టే సోషల్ మీడియా యూజర్లపైనా కఠినంగా వ్యవహరించాలన్నారు. అయితే.. క్షేత్రస్థాయిలో ఆచరణ మాత్రం అధికారులకు కష్టంగా మారుతోంది.

మరోవైపు.. గ్రామ రక్షణ దళాల ఏర్పాటుపై స్వామీజీలు కూడా అభినందిస్తున్నా‎‎‎.. మూఢ నమ్మకాలని క్యాష్ చేసుకున్నారని క్లోజ్ చేసిన కేసుల విషయంలో ఆ స్వామీజీలు ఏమంటున్నారు అనే ప్రశ్న తలెత్తక మానదు. ఆలయాలపై దాడుల కేసులో విచారణకు నియమించిన సిట్ బృందానికి పూర్తిస్థాయిలో సహకరించాలని డీజీపీ ఆదేశాలు జారీ చేసారు. మతం ముసుగులో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోందని, ప్రజలకు వాస్తవాలు తెలియజేసి వాటికి అడ్డుకట్ట వేయాలన్నారు.

ఏది ఏమైనా ఏపీలో ఆలయాలపై దాడుల అంశం రోజుకో రచ్చకు దారి తీస్తుంది. మరి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పోలీసులు ఎలా వ్యవహరిస్తారన్న ప్రశ్నలు మాత్రం అలాగే ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories