Wild Bison:150 ఏండ్ల తర్వాత నల్లమలలో కనిపించిన అడవి దున్న

Wild Bison:

Dhivi
Published on: 3 July 2024 8:54 AM IST
Wild Bison:150 ఏండ్ల తర్వాత నల్లమలలో కనిపించిన అడవి దున్న
X

Wild Bison:150 ఏండ్ల తర్వాత నల్లమలలో కనిపించిన అడవి దున్న

Wild Bison:నల్లమల అడవుల్లో 150ఏళ్ల నుంచి కనిపించని అడవి దున్న ఇప్పుడు మళ్లీ కనిపించింది. నెల రోజుల క్రితం ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో దీన్ని గుర్తించారు అటవీ అధికారులు. వెంటనే వీడియో, ఫొటోలు తీసిన సిబ్బంది విషయాన్ని ఉన్నతాధికారుల వద్దకు తీసుకెళ్లారు. తాజాగా మళ్లీ వెలుగోడు రేంజ్ లో అడవిదున్న కనిపించింది. నాగార్జున సాగర్, శ్రీశైలం పులుల అభయారణ్యం ఆత్మకూరు రేంజ్ డిప్యూటీ డైరెక్టర్ సాయిబాబా మాట్లాడుతూ..ఇన్నేళ్ల తర్వాత అడవిదున్న కనిపించడం ఆశ్చర్యం కలిగించే విషయం అన్నారు.

పెద్దపులులు, ఏనుగులు వంటి భారీ జంతువుల సుదూర ప్రాంతాలకు తరలివెళ్లడం సాధారణమే కానీ ఈ అడవి దున్న మైదానాన్ని దాటుకుని నల్లమలకు చేరి ఉంటుందని వెల్లడించారు.

Dhivi

Dhivi

Next Story