ఏపీ సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన ఆదిత్యనాథ్‌దాస్

X
Highlights
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలు చేపట్టారు. ఇవాళ పదవీ విరమణ...
Arun Chilukuri31 Dec 2020 11:05 AM GMT
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలు చేపట్టారు. ఇవాళ పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత సీఎస్ నీలం సాహ్నీ నుంచి ఆదిత్యనాథ్‌దాస్ బాధ్యతలు స్వీకరించారు. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆదిత్యనాథ్ దాస్ నియామకానికి సీఎం జగన్ ఆమోదముద్ర వేశారు. సచివాలయం మొదటి బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో ఆసీనులైన నూతన చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్‌దాస్‌కు వేదపండితుల ఆశీర్వచనాలు అందించగా పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత సీఎస్ నీలం సాహ్ని పదవీ కాలం నేటి ముగియనుంది. దీంతో ఆమెను సీఎం ముఖ్యసలహాదారుగా ప్రభుత్వం నియమించింది.
Web TitleAdityanath Das take charges as CS of AP
Next Story