మంత్రి ఆదిమూలపు సురేశ్‌కి మరోసారి అస్వస్థత.. వాకింగ్ చేస్తూ..

Adimulapu Suresh Health Condition
x

మంత్రి ఆదిమూలపు సురేశ్‌కి మరోసారి అస్వస్థత.. వాకింగ్ చేస్తూ..

Highlights

Adimulapu Suresh: మంత్రి ఆదిమూలపు సురేశ్‌ మరోసారి అస్వస్థతకు గురయ్యారు.

Adimulapu Suresh: మంత్రి ఆదిమూలపు సురేశ్‌ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఉదయం మార్నింగ్ వాక్‌కు వెళ్లిన మంత్రి నడుస్తూ ఒక్కసారిగా కిందపడిపోయారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని తన కాలేజీలో వాకింగ్‌ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో వైద్యులు వెంటనే కళాశాలకు చేరుకుని సురేశ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీలో హెచ్చుతగ్గుల వల్లే ఆయన కిందపడినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కళాశాలలోనే మంత్రి సురేశ్‌ విశ్రాంతి తీసుకుంటున్నారు. పదిరోజుల క్రితం ఆదిమూలపు సురేశ్‌ అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చేరగా మంత్రికి వైద్యులు స్టెంట్లు వేసి చికిత్స చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories