Adimulapu Suresh: రాష్ట్రానికి పవన్‌ కల్యాణ్‌ గుదిబండగా మారారు

Adimulapu Suresh: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫైరయ్యారు.

Arun Chilukuri
Updated on: 1 Oct 2021 6:31 PM IST
Adimulapu Suresh Fires On Pawan Kalyan
X

Adimulapu Suresh: రాష్ట్రానికి పవన్‌ కల్యాణ్‌ గుదిబండగా మారారు

Adimulapu Suresh: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫైరయ్యారు. పవన్‌ కల్యాణ్‌ కేవలం సినీ పరిశ్రమకే కాకుండా ఈ రాష్ట్రానికే గుదిబండలా తయారయ్యారని ఆదిమూలపు సురేశ్‌ అన్నారు. ఎన్నో పుస్తకాలు చదివానని చెప్పుకునే పవన్‌.. కులాల మధ్య చిచ్చు పెట్టడం తగదన్నారు. రాజకీయంగా ఎదగాలంటే ఇది పద్ధతి కాదనే విషయాన్ని తెలుసుకోవాలని హితవు పలికారు.

పవన్ కల్యాణ్ విజ్ఞత కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. టీడీపీ రాసి ఇచ్చిన స్క్రిప్ట్ పవన్ కల్యాణ్ అనుసరిస్తున్నారన్నారు. రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కల్యాణ్ వైసీపీ గురించి జోస్యం చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. ప్రజలు పని చేసే వారిని మాత్రమే ఆదరిస్తారు తప్ప మాటలు చెప్పే వారని కాదన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story