Top
logo

రేవతి చౌదరి అందుకే టీడీపీకి గుడ్ బై చెప్పారా?

రేవతి చౌదరి అందుకే టీడీపీకి గుడ్ బై చెప్పారా?
X
Highlights

ఏపీ టీడీపీ నాయకురాలు రేవతి చౌదరి ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో చేస్తున్న కార్యక్రమాలను నచ్చక తనకు తానుగా పార్టీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు..

ఏపీ టీడీపీ నాయకురాలు రేవతి చౌదరి ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో చేస్తున్న కార్యక్రమాలను నచ్చక తనకు తానుగా పార్టీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని ఈ నెల 12 వ తేదీనే నాయకుడు చంద్రబాబునాయుడుకి తెలియజేసినట్టు చెప్పారు... ఇన్ని రోజులుగా నాకు అండగా నిలిచిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, చంద్రబాబునాయుడుకి ఆమె ధన్యవాదాలు తెలిపారు. గత కొన్ని నెలలుగా నా సొంత పార్టీ లోనే తన మీద కొంతమంది నాయకులు దుష్ప్రచారం చేస్తున్నా పార్టీ గురించి ఆలోచించి వాళ్ళని పట్టించుకోలేదని ఆమె అన్నారు.

పార్టీ తరపు నుంచి తనకు ఏ విధంగా సహాయసహకారాలు అందడం లేదని.. అదే సమయంలో చంద్రబాబు కూడా తనకు తగిన గుర్తింపు ఇస్తానని మాట ఇచ్చి సంవత్సరం దాటినా నేటికీ ఆ విషయం గురించి సరైన స్పందన లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి ఆమెకు ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి పదవి ఇస్తున్నట్టు ప్రచారం జరిగింది. కానీ అధికారికంగా పార్టీనుంచి మాత్రం ప్రకటన రాలేదు. ఇటీవల ప్రకటించిన పార్టీ పదవుల్లోనూ ఆమెకు స్థానం లేదు అందువల్లే మనస్థాపం చెంది పార్టీనుంచి తప్పుకుని ఉంటారని ప్రచారం జరుగుతోంది.

Web Titleactress revathi chowdary resigns to tdp
Next Story