Srikanth: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు శ్రీకాంత్

Srikanth: బాలకృష్ణ అఖండ సినిమాలో విలన్‌గా నటిస్తున్నా-శ్రీకాంత్

Sandeep Eggoju
Published on: 20 July 2021 10:31 AM IST
Actor Srikanth Visited Tirumala Temple
X
తిరుమల దేవస్థానం సందర్శించిన హీరో శ్రీకాంత్ (ఫైల్ ఇమేజ్)

Srikanth: ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం, రంగనాయకుల మండపంలో వేదపండితులు తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. తాను నటిస్తోన్న సినిమాల గురించి వెల్లడించిన శ్రీకాంత్ మొదటిసారి ప్రతి నాయకుని పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. బోయపాటి డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న బాలకృష్ణ అఖండ సినిమాలో విలన్‌గా నటిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే, కన్నడలో పునీత్ రాజ్‌కుమార్‌తో, తెలుగులో మరణ మృదంగం సినిమాల్లో నటిస్తున్నట్లు తెలిపారు. తనయుడు రోషన్ పెళ్లి సందడి సినిమా ఆగస్టు, సెప్టెంబర్ ‌లో విడుదల కానుందని వెల్లడించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story