ఎన్టీఆర్ జిల్లా ఐతవరంలో వివాహితపై యాసిడ్ దాడి.. మహిళ, ఆమె కుమారుడికి గాయాలు

NTR District: ఐతవరంకు చెందిన వివాహితకు ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అయిన నెల్లూరుకు చెందిన ఆటో డ్రైవర్

Shekhar G
Updated on: 9 July 2023 8:15 AM IST
Acid Attack On A Married Woman In Athivaram Of NTR District
X

ఎన్టీఆర్ జిల్లా ఐతవరంలో వివాహితపై యాసిడ్ దాడి.. మహిళ, ఆమె కుమారుడికి గాయాలు

NTR District: ఎన్టీఆర్ జిల్లా ఐతవరంలో దారుణం జరిగింది. వివాహితపై ఆటో డ్రైవర్ యాసిడ్‌ దాడికి పాల్పడ్డాడు. దాడిలో మహిళ, ఆమె కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను, కొడుకును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఐతవరంకు చెందిన వివాహితకు నెల్లూరుకు చెందిన ఆటో డ్రైవర్ మనీసింగ్ ఫేస్‌ బుక్‌ ద్వారా పరిచయం అయ్యాడు. ఈ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే గతకొన్ని రోజులుగా మహిళ మనీసింగ్‌ను దూరం పెట్టింది. దీంతో ఆగ్రహించిన వ్యక్తి తెల్లవారుజామున వివాహితపై యాసిడ్‌తో దాడి చేసి పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story