ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు.. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా..

ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు.. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా..
x
Highlights

టీడీపీ కమిటీలను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. 27 మంది సభ్యులతో టీడీపీ కేంద్ర కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మరో 25 మందితో...

టీడీపీ కమిటీలను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. 27 మంది సభ్యులతో టీడీపీ కేంద్ర కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మరో 25 మందితో టీడీపీ పొలిట్‌ బ్యూరో ఏర్పాటు చేశారు. 31 మందితో తెలంగాణ టీడీపీ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడుని నియమించారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్.రమణనే కొనసాగిస్తున్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నారా లోకేష్, వర్ల రామయ్య, రామ్మోహన్‌నాయుడు, నిమ్మల రామానాయుడు, బీద రవిచంద్ర, కొత్తకోట దయాకర్‌రెడ్డి, నర్సింహులు, కంభంపాటి రామ్మోహన్‌రావు, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులుగా ప్రతిభా భారతి, కాశీనాథ్, గల్లా అరుణ, సత్యప్రభ, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, మెచ్చా నాగేశ్వరరావును నియమించారు.

మరోవైపు టీడీపీ పొలిట్‌ బ్యూరోలోకి మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, కళా వెంకట్రావు, బొండా ఉమా, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బాలకృష్ణ, గల్లా జయదేవ్‌, ఫరూక్‌, రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి, పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్ర ,గుమ్మడి సంధ్యారాణి తదితరులను తీసుకున్నారు. పార్టీ అధికార ప్రతినిధులుగా ఆరుగురికి అవకాశం కల్పించారు. ఎమ్మెల్సీ అశోక్‌బాబుతోపాటు తెలంగాణ నుంచి నండూరి నర్సిరెడ్డి, జ్యోత్స్న, ప్రేమ్‌కుమార్‌ జైన్‌, నజీర్‌, దీపక్‌రెడ్డిలకు అవకాశం కల్పించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories