నెల్లూరు జిల్లా అన్నారెడ్డిపాలెం దగ్గర ప్రమాదం

Nellore: జగనన్న విద్యాకానుక కిట్లు తరలిస్తున్న వాహనం బోల్తా

Jyothi
Published on: 3 July 2022 1:12 PM IST
Accident Near Annareddypalem, Nellore District
X

నెల్లూరు జిల్లా అన్నారెడ్డిపాలెం దగ్గర ప్రమాదం

Nellore: జగనన్న విద్యా కానుక కిట్లు తరలిస్తున్న దోస్త్ వాహనం నెల్లూరు జిల్లా సంగం మండలం అన్నారెడ్డిపాలెం వద్ద ప్రమాదవశాత్తు కాలువలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తో పాటు మరో వ్యక్తి సురక్షితంగా బయటపడగా అందులో తరలిస్తున్న పుస్తకాలు నీళ్లలో తడిచిపోయాయి.

సమాచారం అందడంతో పోలీసులు, విద్యాశాఖ అధికారులు.. ఘటనా స్థలానికి చేరుకొని వాహనాన్ని బయటకు తీశారు. సర్వ శిక్ష అభియాన్ అడిషనల్ కోఆర్డినేటర్ ఉషారాణి అక్కడికి చేరుకొని పుస్తకాల తరలింపు చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదానికి గురైన వాహనంలో ఐదు మండలాలకు చెందిన విద్యా కానుక కిట్లు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. నీటిలో తడిసి పాడైన కిట్లను పరిశీలించారు.

Jyothi

Jyothi

Next Story