నెల్లూరు జిల్లా శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలో ప్రమాదం

* నెల్లూరు థర్మల్ విద్యుత్కేంద్రంలో కూలిపోయిన యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ ఆఫర్

Rama Rao
Published on: 28 May 2022 3:58 PM IST
Accident At Sri Damodaram Sanjeevaiah Thermal Power Plant in Nellore
X

నెల్లూరు జిల్లా శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలో ప్రమాదం

Nellore: నెల్లూరు జిల్లా శ్రీదామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్తు కేంద్రంలో ప్రమాదం జరిగింది. దీంతో రెండు యూనిట్లలో విద్యుత్తు ఉత్పత్తి స్తంభించింది. థర్మల్ విద్యుత్కేంద్రంలో యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ ఆఫర్ కూలిపోవడంతో విద్యుత్తు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. నిర్వహణలోపమే ప్రమాదానికి కారణమి సమాచారం. ఆఫర్ కూలిన సమయంలో ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ప్రమాదంతో ప్లాంటంతా బూడిదమయమైంది. చిమ్నీనుంచి బూడిద వెదజల్లుతోంది. పరిసర గ్రామాల ప్రజలు ఆందోళనతో ఉన్నారు. అధికారులు స్పందించి మరమ్మతు చర్యలు మమ్మరం చేశారు.

Rama Rao

Rama Rao

Next Story