దోపిడీని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్న భయంతోనే అరెస్టులు : అచ్చెన్నాయుడు

పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారు

admin
Published on: 24 Dec 2020 6:12 PM IST
దోపిడీని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్న భయంతోనే అరెస్టులు : అచ్చెన్నాయుడు
X

అక్రమ అరెస్టులు చేయడం అధికార వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య అని మండిపడ్డారు ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు. నిమ్మాడలో ఆయనను హౌస్‌ అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. వైసీపీ చేస్తున్న దోపిడీని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్న భయంతో లచ్చన్న విగ్రహం తొలగింపు విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారని అచ్చెన్న అరోపించారు. పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని.. ప్రజలన్నీ గమనిస్తున్నారని అన్నారు. తనను అరెస్ట్ చేయడంపై కోర్టుకు వెళ్తానని చెప్పారు అచ్చెన్న.

admin

admin

Next Story