Nalgonda: తహసీల్దార్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు.. పెట్టెలో రూ.2 కోట్ల నగదు

Nalgonda: మహేందర్ రెడ్డితో పాటు బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ సోదాలు

Shekhar G
Published on: 30 Sept 2023 2:59 PM IST
ACB Searches Tehsildar House In Nalgonda
X

Nalgonda: తహసీల్దార్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు.. పెట్టెలో రూ.2 కోట్ల నగదు

Nalgonda: ఏసీబీ వలలో చిక్కాడు ఓ అవినీతి అధికారి. ప్రజాసేవ చేయాల్సిన ఆ ఆఫీసర్.. అందినకాడికి దోచుకున్నాడు. కోట్లకు పడగలెత్తాడు. అతని ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీ చేయగా.. భారీ ఎత్తున నోట్ల కట్టలు బయటపడ్డాయి.

ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణలతో.. నల్గొండ జిల్లా మర్రిగూడ తహశీల్దార్ మహేందర్ రెడ్డిపై ఏసీబీ రైడ్ చేసింది. ఎల్బీనగర్‌ షిరిడి సాయినగర్ కాలనీలోని అతని ఇంటిపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు ఏసీబీ అధికారులు. ఈ దాడుల్లో తహశీల్దార్ మహేందర్ రెడ్డి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు లభ్యమయ్యాయి. ట్రంక్ పెట్టలో.. 2 కోట్ల రూపాయల నగదును అధికారులు గుర్తించారు. అలాగే కిలోల కొద్ది బంగారం సహా పలు స్థిరాస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. మహేందర్ రెడ్డికి చెందిన 15చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. మహేందర్ రెడ్డితో పాటు.. అతని బంధువుల ఇళ్లలోనూ రైడ్స్ జరిగాయి.

Shekhar G

Shekhar G

Next Story