బెజవాడ దుర్గగుడిలో కొనసాగుతోన్న ఏసీబీ దాడులు

బెజవాడ దుర్గగుడిలో కొనసాగుతోన్న ఏసీబీ దాడులు
x

బెజవాడ దుర్గగుడిలో కొనసాగుతోన్న ఏసీబీ దాడులు

Highlights

బెజవాడ దుర్గగుడిలో ఏసీబీ మరోసారి సోదాలు నిర్వహిస్తోంది. జమ్మిదొడ్డిలోని ఆలయ పరిపాలన కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. 15మందితో కూడిన...

బెజవాడ దుర్గగుడిలో ఏసీబీ మరోసారి సోదాలు నిర్వహిస్తోంది. జమ్మిదొడ్డిలోని ఆలయ పరిపాలన కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. 15మందితో కూడిన అధికారుల బృందం రికార్డులను పరిశీలిస్తోంది. ఇప్పటికే పలుమార్లు బెజవాడ దుర్గగుడిలో సోదాలు చేపట్టిన ఏసీబీ మరోమారు తనిఖీలు చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. అయితే, వెండి సింహాల మాయానికి సంబంధించిన నివేదికను తీసుకున్న ఏసీబీ దుర్గగుడి అధికారుల నుంచి వివరాలు సేకరించింది.

బెజవాడ దుర్గగుడిలో ఏసీబీ సోదాలు ఇలాగుంటే, మరోవైపు ఉద్యోగులపై సస్పెన్షన్ల వేటు కొనసాగుతోంది. ఏసీబీ రిపోర్ట్ ఆధారంగా విజయవాడ దుర్గగుడి ఉద్యోగులను ప్రభుత్వం సస్పెండ్ చేస్తోంది. నిన్న ఒక్కరోజే 26మంది ఆలయ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేసింది. ఆరుగురు సూపరింటెండెంట్లు, 15 మంది సీనియర్ అసిస్టెంట్లతో పాటు జూనియర్ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్లపై వేటు పడింది. ఏసీబీ నివేదిక ఆధారంగా మరికొందరిపైనా వేటు వేయనున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో బెజవాడ దుర్గగుడి ఉద్యోగుల్లో తీవ్ర టెన్షన్ నెలకొంది.

విజయవాడ దుర్గగుడిలో వెలుగుచూసిన అవినీతిపై ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తోంది. ఏసీబీ సోదాల్లో బయటపడిన అక్రమాల ఆధారంగా ఉద్యోగులపై వేటు వేస్తోంది. ఇప్పటికే మూడురోజులుగా ఏసీబీ తనిఖీలు చేయగా, ఇప్పుడు మళ్లీ రికార్డులను పరిశీలిస్తోంది. గుడి భూములు, షాపుల లీజు వ్యవహారాలతో పాటు అన్నదానం, దర్శనాల టికెట్ల అమ్మకం, అమ్మవారి చీరల వ్యవహారాల్లో భారీగా అక్రమాలు జరిగినట్టు ఏసీబీ గుర్తించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories