Andhra Pradesh: అచ్చెన్నాయుడు కేసులో మరో ట్విస్ట్

Andhra Pradesh: అచ్చెన్నాయుడు కేసులో మరో ట్విస్ట్
x
Atchen Naidu (File Photo)
Highlights

ఈఎస్ఐ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటు అరెస్టైన టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవహారం కీలక మలుపు తిరిగింది.

ఈఎస్ఐ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటు అరెస్టైన టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై గుంటూరు జనరల్‌ ఆస్పత్రి నుంచి వివరాలను తెప్పించి న్యాయమూర్తి పరిశీలించారు. మూడు, నాలుగు రోజుల్లో అచ్చెన్నాయుడినీ డిశ్ఛార్జి చేసే అవకాశం ఉందని వైద్యులు చెప్పడంతో వీటిని పరిశీలించి ఏసీబీ కస్టడీకి ఇచ్చారు. ఆస్పత్రి నుంచి గురువారం డిశ్ఛార్జి చేస్తారని తమకు తెలిసిందని అచ్చెన్న తరఫు న్యాయవాదులు అన్నారు.

కాగా.. ఈ నెల 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మూడు రోజుల కస్టీడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది. అచ్చెన్నయుడిని ట్రీట్మెంట్ నిమిత్తం హాస్పిటల్ ఉన్నారు. అయితే ఆయన దగ్గరకు వెళ్లి న్యాయవాది, ప్రభుత్వ వైద్యుడి సమక్షంలో ఏసీబీ అధికారులు వివరాలు సేకరించాలని కోర్టు క్లారిటీ ఇచ్చింది. దీంతో ఆయన్ను ఈ రోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తారా? కోర్టు చెప్పినట్లు ఆస్పత్రిలోనే ప్రశ్నిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఆయనను ప్రసించాల్సి వస్టే మంచం మీదే ఉండి సమాధానాలివ్వచ్చని, కూర్చోమని లేదా నిల్చోమని అధికారులు కోరడానికి వీల్లేదని స్పష్టంగా పేర్కొంది.

ఈ స్కాంలో నిందితులుగా ఉన్న ఐఎంస్‌ మాజీ డైరెక్టర్‌ రమేష్‌కుమార్‌కు ఏసీబీ 3 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. మరో కేసులో నిందితులు గోనె వెంకటసుబ్బారావు, డాక్టర్‌ విజయ్‌కుమార్‌, డాక్టర్‌ వి.జనార్దన్‌, ఎంకేపీ చక్రవర్తిలను మరో రెండు రోజుల కస్టడీకి అనుమతిచ్చారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories