AB Venkateswara Rao: నా సస్పెన్షన్‌ ముగిసింది.. పూర్తి జీతం ఇవ్వండి

AB Venkateswara Rao: ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.

Arun Chilukuri
Updated on: 25 March 2022 8:31 PM IST
AB Venkateswara Rao Wrote a Letter to AP govt Urges to Pay Full Salary as His Suspension Ended
X

AB Venkateswara Rao: నా సస్పెన్షన్‌ ముగిసింది.. పూర్తి జీతం ఇవ్వండి

AB Venkateswara Rao: ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఇంకా త‌న‌ను స‌స్పెన్ష‌న్‌లో కొన‌సాగించే అధికారం రాష్ట్ర ప్ర‌భుత్వానికి లేదని ఆ లేఖలో పేర్కొన్నారు. తాను స‌స్పెండై రెండేళ్లు పూర్త‌యినందున అది తొల‌గిపోయిన‌ట్లేన‌న్నారు. స‌స్పెన్ష‌న్‌ను ఆరేసి నెల‌ల చొప్పున పొడిగిస్తూ వ‌చ్చార‌ని, దీంతో మొత్తం క‌లిపి రెండేళ్ల స‌స్పెన్ష‌న్ గ‌డువు జ‌న‌వ‌రి 27 తోనే ముగిసింద‌న్నారు. రెండేళ్లకు మించి స‌స్పెన్ష‌న్‌కు కేంద్ర హోం శాఖ అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి అని, గడువు లోపు ఆ అనుమతి తీసుకోనందున ఇక అది ముగిసినట్టేనన్నారు. సస్పెన్షన్ ముగిసినందున నిబంధనల ప్రకారం పూర్తి వేతనం ఇవ్వాలని ఆ లేఖలో పేర్కొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story