AB Letter: వైఎస్ వివేకా హత్య కేసుపై సీబీఐకి ఏబీ లేఖ

AB Letter: ఏపీలో పెను సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వర్రావు సీబీఐకు లేఖ

Sandeep Eggoju
Updated on: 16 April 2021 5:46 PM IST
AB Venkateshwar Rao Letter to CBI on YS Viveka Reddy Death Issue
X

ఎబీ వెంకటేశ్వర్ రావు (ఫైల్ ఇమేజ్)

AB Letter: ఏపీలో పెను సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వర్రావు సీబీఐకు లేఖ రాశారు. వివేకా మర్డర్‌ను గుండెపోటు గానో ప్రమాదం గానో చిత్రీకరించేందుకు కొందరు ఎంపీలు ప్రయత్నించారని సీబీఐ దృష్టికి తీసుకెళ్లారు. మర్డర్ జరిగిన తర్వాత ఇల్లంతా కడిగేసి, మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించేవరకు ఇంట్లోకి ఎవరూ రాకుండా బంధువులు ఆధీనంలోకి తీసుకున్నారని తెలిపారు. పోలీసులు, ఇంటలిజెన్స్ సిబ్బంది, మీడియాను కావాలనే అడ్డుకున్నారని ఏబీ వెంకటేశ్వర్రావు తన లేఖలో వివరించారు. అయితే, సీబీఐకి రెండుసార్లు సమాచారమిచ్చినా, ఫోన్ చేసి చెప్పినా స్పందించలేదని ఏబీ తెలిపారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story