TTD EO: టీటీడీ ఆన్‌లైన్‌ అప్లికేషన్లకు ఆధార్ లింక్‌తో దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట

TTD EO: తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో ఈవో సమీక్ష

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 29 Jun 2024 8:59 PM IST
Aadhaar Link To TTD Online Applications To Stop Middlemen Says TTD EO
X

TTD EO: టీటీడీ ఆన్‌లైన్‌ అప్లికేషన్లకు ఆధార్ లింక్‌తో దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట

TTD EO: శ్రీవారి భక్తులకు టీటీడీ అందిస్తున్న ఆన్‌లైన్‌ అప్లికేషన్ సేవలకు ఆధార్‌ను లింక్ చేయడం ద్వారా పారదర్శకతతో పాటు దళారీ వ్యవస్థను నియంత్రించేందుకు వీలవుతుందని టీటీడీ ఈవో జె.శ్యామలరావు చెప్పారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో యూఐడీఏఐ నుంచి వచ్చిన అధికారులు, టీసీఎస్ జియో, టీటీడీ ఐటీ విభాగంతో ఈవో సమీక్ష నిర్వహించారు. ఇదివరకే టీటీడీ దర్శనం, వసతి, ఆర్జిత సేవలు, శ్రీవారి సేవ తదితర సేవలను ఆన్‌లైన్‌ ద్వారా భక్తులు బుక్ చేసుకునేందుకు వీలు కల్పిస్తోందన్నారు. ఈ అప్లికేషన్ల ద్వారా కూడా దళారుల బెడద తప్పడం లేదని, వాటిని నియంత్రించడానికి ఆధార్ లింక్ చేసేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఐటీ అధికారులకు సూచించారు. ఆధార్ ద్వారా యాత్రికుల గుర్తింపు, పరిశీలన, బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఎలా చేయాలి, ఆధార్ డూప్లికేషన్ ఎలా నిరోధించాలి తదితర అంశాలపై చర్చించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story