AP News: ఎన్టీఆర్ జిల్లాలో దారుణం.. ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం

AP News: ఎన్టీఆర్ జిల్లాలో ఇంటర్ విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందుతులపై ఫోక్సో కేసు నమోదు చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 19 Aug 2024 2:08 PM IST
AP News
X

AP News

AP News: ఎన్టీఆర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇంటర్ విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. విస్సన్నపేట మండలం నూతిపాడు గ్రామానికి చెందిన మైనర్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. రెండు నెలలుగా ప్రేమ పేరుతో అదే గ్రామానికి చెందిన యువకుడు వేధింపులకు గురి చేస్తున్నాడంటున్నారు.

యువకుడికి మరో ఇద్దరు యువకులు సహకరించినట్లు సమాచారం. ఈనెల 10న స్నేహితులతో కలిసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డట్లు పోలీసులు నిర్ధారించారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని యువకులు బెదిరించారు. బాధితురాలి ఫిర్యాదుతో నిందుతులపై ఫోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story