Eluru: ప్రేమ వివాహం.. రైలుకింద పడి యువకుడు సూసైడ్

Eluru: కౌన్సెలింగ్ పేరుతో యువకుడిని వేధించారని బంధువుల ఆరోపణ

Shekhar G
Published on: 4 Sept 2023 4:15 PM IST
A Young Man Committed Suicide By Falling Under A Train In Eluru District
X

Eluru: ప్రేమ వివాహం.. రైలుకింద పడి యువకుడు సూసైడ్

Eluru: ఏలూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ యువకుడు రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. దెందులూరు సమీపంలో రైలు కింద పడి తేజామూర్తి అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు నెలల క్రితమే ప్రియాంక అనే యువతితో ప్రేమ వివాహం జరిగింది. అయితే మనస్పర్థలతో తేజాపై ఏలూరు పీఎస్‌లో ఫిర్యాదు చేసింది యువతి. పోలీసులు పలుమార్లు పీఎస్‌కు పిలిపించి కౌన్సెలింగ్ పేరుతో వేధించారని మృతుడి బంధువులు ఆరోపించారు. ప్రియాంకతో సెటిల్‌మెంట్ చేసుకోవాలని వన్ టౌన్ సీఐ వేధించినట్లు బంధువులు ఆరోపించారు. సెటిల్‌మెంట్ చేసుకోకపోతే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారని ఆరోపించారు. పోలీసుల ఒత్తిడి, ప్రియాంక కుటుంబ సభ్యుల బెదిరింపుల వల్లే తేజ సూసైడ్ చేసుకున్నాడని బంధువులు ఆరోపించారు.

Shekhar G

Shekhar G

Next Story