Nellore: సెల్‌ఫోన్లో అసభ్యకర మెసేజ్‌లు పెడుతున్నాడంటూ ఆరోపణ.. చెప్పుతో కొట్టి దేహశుద్ధి చేసిన బాధిత మహిళ

Nellore: చివరకు సారీ చెప్పడంతో సద్దుమణిగిన వివాదం

Jyothi
Published on: 12 March 2023 11:41 AM IST
A Woman Slapped a Young Man in Nellore
X

Nellore: నడిరోడ్డుపై పోకిరీని చితకబాదిన బాధిత మహిళ 

Nellore: సెల్‌ఫోన్లో అసభ్యకర మెసేజ్‌లు పెడుతూ వేధిస్తున్న పోకిరీకి ఓ మహిళ నడిరోడ్డుపై దేహశుద్ది చేసింది. చెప్పుతో కసితీరా చెంపపై కొడుతూ తగిన బుద్ది చెప్పింది. నెల్లూరు జిల్లా కావలిలో నడిరోడ్డుపై ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక యువకుడు కళ్యాణ్‌..కొద్ది రోజులుగా ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకర మెసేజ్‌లు పెడుతూ వేధిస్తున్నాడని బాధితురాలు ఆరోపిస్తోంది. అందుకే అతడిని నడిరోడ్డుపై చెప్పుతో కొట్టానని వివరించింది. చివరకు యువకుడు బాధిత మహిళకు క్షమాపణ చెప్పడంతో..గొడవ సద్దుమణిగింది.

Jyothi

Jyothi

Next Story