Nandyala: ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ తల్లిదండ్రులకు సెల్ఫీ వీడియో పంపిన మహిళ

A Woman Sent A Selfie Video To Her Parents Saying She Was Committing Suicide
x

Nandyala: ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ తల్లిదండ్రులకు సెల్ఫీ వీడియో పంపిన మహిళ

Highlights

Nandyala: నిద్రమాత్రలు మింగి ఇంటి నుంచి వెళ్లిపోయిన మహిళ

Nandyala: నంద్యాల జిల్లాలో మేఘన అనే మహిళ సెల్ఫీ వీడియో తీసుకొని తల్లిదండ్రులకు పంపింది. భర్త వేధింపులు భరించలేకపోతున్నానని, తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ సెల్ఫీ వీడియో పంపి ఇంటి నుంచి వెళ్లిపోయింది. నంద్యాల జిల్లా డోన్ మండలం జిగదుర్తి గ్రామానికి చెందిన మేఘనకు సురేష్ అనే వ్యక్తితో కొంత కాలం క్రితం వివాహమైంది. అయితే ఇటీవల కాలంలో భర్త సురేష్ వేధింపులెక్కువయ్యాయని తాను తట్టుకోలేకపోతున్నానని మేఘన సెల్ఫీ వీడియోలో తల్లిదండ్రులకు తెలిపింది. తాను ఆత్మత్య చేసుకుంటున్నానని నిద్రమాత్రలు నీటిలో కలుపుకుని తాగింది. తరువాత ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫర్యాదు చేశారు. మేఘన కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories