Chittoor: చిత్తూరు జిల్లాలో కరోనాతో ఊపిరాడక ప్రాణాలు విడిచిన మహిళ

Chittoor District: వైద్యం కోసం డాక్టర్ వద్దకు వచ్చింది. అందరూ చూస్తుండగానే ఊపిరాడక ప్రాణాలు విడిచింది.

Sandeep Eggoju
Updated on: 3 May 2021 4:11 PM IST
A Woman Died With the Corona infront of  Doctor in Chittoor | Corona Cases in AP
X

కరోన వైరస్  (ప్రతికత్మక చిత్రం)

Chittoor District: చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం అంబోదర పల్లి గ్రామానికి చెందిన రాణెమ్మ గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతూ ఉంది. ఇవాళ ఉదయం వైద్యం కోసం ఆమెను గంగాధర నెల్లూరుకు కుటుంబసభ్యులు తీసుకొచ్చారు. ముందుగా ఆర్‌ఎంపీ డాక్టర్ వద్ద వైద్యం చేయించి తర్వాత కరోనా టెస్ట్ చేయించాలి అనుకున్నారు.

క్లినిక్ కు డాక్టర్ రావడం కాస్తా ఆలస్యమైంది. ఇంతలో రాణెమ్మకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. ఊపిరి ఆడక క్లినిక్ ఆవరణలోనే ప్రాణాలు విడిచింది. డాక్టర్ వచ్చి చెకప్ చేసి చనిపోయిందని నిర్ధారించారు. రాణెమ్మ మరణవార్త విని ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా రోధించారు

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story