Anantapur: అనంతపురం జిల్లాలో వాలంటీర్‌పై ఎలుగుబంటి దాడి

Anantapur: యాటకల్లులో పింఛన్ల పంపిణీకి వెళ్తున్న వాలంటీర్‌

Jyothi
Published on: 4 Jan 2023 1:09 PM IST
A Volunteer was Attacked by a Bear in Anantapur District
X

Anantapur: అనంతపురం జిల్లాలో వాలంటీర్‌పై ఎలుగుబంటి దాడి

Anantapur: పింఛన్ల పంపిణీకి వెళ్తున్న వాలంటీర్‌పై ఎలుగుబంటి దాడి చేసిన ఘటన అనంతపురం జిల్లా శెట్టూరు మండలం యాటకల్లు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలోని చివరి వార్డులో పింఛన్లు పంపిణీ చేసేందుకు వెళ్తున్న వాలంటీర్‌పై ఎలుగుబంటి ఒక్కసారిగా దాడి చేసింది. దీంతో తీవ్ర గాయాలైన వాలంటీర్‌ను స్థానికులు సమీప ఆస్పత్రికి తరలించారు. తరచూ గ్రామంలో ఎలుగుబంట్లు, చిరుతలు సంచరిస్తున్నాయంటున్నారు గ్రామస్తులు. రాత్రిపూట రైతులు పొలాల్లోకి వెళ్లాలంటేనే భయాందోళనలకు గురవుతున్నారని.. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు స్పందించాలంటూ కోరుతున్నారు.

Jyothi

Jyothi

Next Story