NTR District: ట్రాక్టర్ టైర్ మీద పడి రెండేళ్ల బాలుడు మృతి

NTR District: బాలుడి తలకు తీవ్రగాయం కావడంతో ఆస్పత్రికి తరలించే లోపే మృతి

Shekhar G
Published on: 4 Sept 2023 5:18 PM IST
A Two Year Old Boy Died After Falling On A Tractor Tire
X

NTR District: ట్రాక్టర్ టైర్ మీద పడి రెండేళ్ల బాలుడు మృతి

NTR District: ప్రమాదవశాత్తు ట్రాక్టర్ టైర్ మీద పడి రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటు చేసుకుంది. నిలబెట్టి ఉన్న ట్రాక్టర్ టైర్‌తో సరదాగా ఆడుకున్న చిన్నారి.. అదే టైరు కింద పడి చనిపోయాడు. ట్రాక్టర్ టైర్‌ ఒక్కసారిగా బాలుడిపై పడటంతో తలకు తీవ్రంగా గాయమైంది. అది గమనించిన ఓ వ్యక్తి వెంటనే బాలుడిని ఆసుపత్రికి తరలించినా.. ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Shekhar G

Shekhar G

Next Story