మంచినీళ్ళు అడిగి మొత్తం దోచుకెళ్ళిపోయాడు..

మంచినీళ్ళు అడిగి మొత్తం దోచుకెళ్ళిపోయాడు..
x
Highlights

మాత్రలు వేసుకోవాలి.. మంచినీళ్ళు కావాలని ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని అడిగాడు. అయ్యోపాపం అని నీళ్లు ఇచ్చేలోపు.. ఇంట్లోకి వెళ్లి ఆమె మెడలో ఉన్న మొత్తం...

మాత్రలు వేసుకోవాలి.. మంచినీళ్ళు కావాలని ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని అడిగాడు. అయ్యోపాపం అని నీళ్లు ఇచ్చేలోపు.. ఇంట్లోకి వెళ్లి ఆమె మెడలో ఉన్న మొత్తం బంగారాన్ని కాజేసుకొని వెళ్ళిపోయాడు ఓ కేటుగాడు..ఇక వివరాల్లోకి వెళ్తే పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఇగుడూరు గ్రామంలో వెంకటరంగమ్మ అనే ఓ మహిళ ఒంటరిగా ఉంటుంది. ఇది గమనించిన కేటుగాడు నిన్న ఉదయం 11 గంటల సమయంలో అవ్వా కొన్ని మంచినీళ్ళు కావాలి మాత్రలు వేసుకోవాలని అడిగాడు.. మంచినీళ్ళ కోసం ఆ మహిళ లోపలికి వెళ్ళింది.

ఈ క్రమంలో ఆమెతో పాటే లోపలికి వెళ్లి అమెకు మత్తుమందు ఇచ్చాడు. దీనితో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఆమె మేడలో ఉన్నా నాలుగు తులాల బంగారు గొలుసు, చేతికి ఉన్న ఐదు తులాల బంగారం గాజులను లాక్కున్నాడు. ఇక ఆమె కమ్మలు తీసే క్రమంలో వృద్ధురాలు లేచి ప్రతిఘటించడంతో వాటిని వదిలేసి పారిపోయాడు. కాసేపటి తర్వాత స్థానికులు వృద్ధురాలిని గమనించి ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత బంధువుల సహాయంతో పోలీసులకి ఫిర్యాదు చేసారు. చుక్కూరులో కూడా ఇదే తరహ ఘటన చోటు చేసుకోవడంతో రెండు చేసింది ఒక్కడేనా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories